ఒక్క రోజులో నమోదైన కేసులు అవి
క్రియాశీలక కేసుల సంఖ్య 2331
రెండు మరణాలు నమోదు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 355 కొవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసులు అవి. దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య ఇప్పుడు 2331 అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. గడచిన 24 గంటలలో కర్నాటకలో ఒకటి, కేరళలో ఒకటి వెరసి రెండు మరణాలు నమోదు అయ్యాయని మంత్రిత్వశాఖ శుక్రవారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా వల్ల తెలుస్తోంది.
రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య డిసెంబర్ 5కు ముందు రెండు అంకెల స్థాయికి పడిపోయింది. కాని కొత్త వేరియంట్, శీతల వాతావరణ పరిస్థితుల వల్ల కేసుల సంఖ్య మళ్లీ పెరగసాగింది. డిసెంబర్ 5 తరువాత 31ప ఒక్క రోజులో 841 కొత్త కేసులు నమోదైనట్లు, 2021 మేలో గరిష్ఠ స్థాయిలో నమోదైన కేసుల సంఖ్య కన్నా అది 0.2 శాతం అధికం అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం క్రియాశీలక కేసులలో సుమారు 92 శాతం మంది రోగులు ఇంటిలోనే కోలుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో ఇంత వరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడమైంది.