న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,407 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో నిన్నటితో పోలిస్తే పాజిటీవ్ కేసుల సంఖ్య 13శాతం తగ్గింది. ఇక, కరోనాతో 804మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5కోట్లకు చేరుకుంది. ఇందులో 5,07,981 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 1,36,962 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా.. ఇప్పటివరకు 4,11,80,751మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,10,443 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతానికి తగ్గిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 172.29కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
India records 50k new corona cases in 24 hrs