Wednesday, January 22, 2025

దేశంలో కొత్తగా 6,050 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలతో ఈ విషయం వెల్లడైంది. గురువారం రికార్డు అయిన కొత్త కేసుల సంఖ్య 5300 గా ఉంది. ఇది ఇప్పుడు పెరిగింది. శుక్రవారం రికార్డు అయిన కేసులను పరిశీలిస్తే ఇది గడిచిన 203 రోజులలో అత్యధిక కేసుల పరిణామం అయింది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,303గా ఉంది.

కరోనా తీవ్రతతో 14 మంది ఒక్కరోజులో మరణించారు. ఈ క్రమంలో ఇప్పుడు దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం మీద 5,30,943కు చేరుకుంది. కేరళ, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు ఉత్తరప్రదేశ్, ఢిలీల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆయా ప్రాంతాలలో అత్యవసర రీతిలోనే కట్టడికి చర్యల అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News