Friday, December 20, 2024

225 రోజుల్లో అత్యధికంగా 797 కొత్త కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు  పెరుగుతున్నాయి. 225 రోజుల్లో అత్యధికంగా 797 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా ఐదు కొత్త మరణాలు సంభవించాయి. కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడు ఒక్కొక్కరు చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 4,097 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2020 ప్రారంభమైన మహమ్మారి రోజువారీ కేసులు లక్షల్లో బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా సుమారు నాలుగు సంవత్సరాలలో లక్షల్లో మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News