Tuesday, November 5, 2024

918 కొత్త కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -
నాలుగు మరణాలు నమోదు!
పాజిటివిటీ 2.08 శాతంగా నమోదయింది.

న్యూఢిల్లీ: సోమవారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత దేశంలో ఒకే రోజు 918 తాజా కరోనావైరస్ కేసులు పెరిగాయి, కాగా క్రియాశీల కేసులు 6350కి పెరిగాయి. దేశంలోని కొవిడ్19 మరణాల సంఖ్య నాలుగు తాజా మరణాలతో 5,30,806కి పెరిగింది. రెండు మరణాలు రాజస్థాన్‌లో, ఒకటి కర్ణాటకలో, మరొకటి కేరళలో నమోదయ్యాయి. తాజా అప్‌డేట్ ప్రకారం రోజువారీ పాజిటివిటీ 2.08 శాతంగాను, వారం పాజిటివిటీ 0.86 శాతంగాను ఉంది. సంక్రమణల సంఖ్య తాజాగా 4.46 కోట్లు(4,46,96,338)గా ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం ఇప్పుడు క్రియాశీలక కేసులు మొత్తం కేసులలో 0.01 శాతంగా ఉన్నాయి. అయితే జాతీయ కొవిడ్19 రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 44,225 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు కొవిడ్ టెస్టులు మొత్తంగా 92.03 కోట్లు నిర్వహించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220.65 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోస్లు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News