Monday, January 20, 2025

భారత దౌత్యవేత్తలపై కెనడా విచారణను తిరస్కరించిన భారత్!

- Advertisement -
- Advertisement -

‘అసమంజసం’ అని పేర్కొంది

న్యూ ఢిల్లీ: కెనడా నుండి దౌత్యపరమైన సమాచార మార్పిడికి భారత ప్రభుత్వం గట్టి ఖండనను జారీ చేసింది, కెనడా దర్యాప్తులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, ఇతర దౌత్యవేత్తలు “ఆసక్తి ఉన్న వ్యక్తులు”(Persons of interest) అని పేర్కొంది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భారత ప్రభుత్వం  కెనడా వాదనలను “అసమంజసం”(preposterous) గా అభివర్ణించింది, వాటిని ట్రూడో ప్రభుత్వ రాజకీయ ఎజెండాగా ఆపాదించింది. పైగా అవి ఓట్ బ్యాంక్ పొలిటిక్స్ అని ఖండించింది.

‘‘ ప్రధాని ట్రూడో కు భారత్ పట్ల కొన్నేండ్లుగా విద్వేష భావం ఉంది’’ అని కూడా భారత్ తన ప్రకటనలో పేర్కొంది. 2018లో ఆయన వివాదాస్పద భారత పర్యటన కెనడాలోని ఓ వర్గం వారి ఓట్లను పొందేందుకే చేసిన ప్రయత్నం అంది.

భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద , వేర్పాటువాద ఎజెండాలతో సంబంధం ఉన్న వ్యక్తులను చేర్చుకున్నందుకు ట్రూడో క్యాబినెట్‌ను భారత ప్రభుత్వం విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News