Wednesday, January 22, 2025

అరుణాచల్ 11 స్థానాల పేర్లను చైనా మార్చడాన్ని తిరస్కరించిన భారత్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దక్షిణ టిబెట్‌గా బీజింగ్ పేర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 స్థానాల పేర్లను మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ మంగళవారం తిరస్కరించింది. ఇటువంటి చర్యలు ఈశాన్య రాష్ట్రాలు భారత దేశ అంతర్భాగమన్న వాస్తవాన్ని మార్చజాలవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసి)లోని లడఖ్ సెక్టార్‌లో సైనిక ప్రతిష్టంభన కారణంగా ఆరు దశాబ్దాలలో రెండు దేశాలు తమ సంబంధాలలో అత్యంత దారుణమైన ద్వైపాక్షిక సంబంధాలను చూస్తున్న సమయంలో చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేర్లను మార్చింది.

ఏప్రిల్ 2017లో ఆరు స్థానాల పేర్లు, డిసెంబర్ 2021లో మరో 15 స్థానాల పేర్లను మార్చిన తర్వాత, అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాల పేర్లను చైనా ఏకపక్షంగా మార్చడం ఇది మూడోసారి. అరుణాచల్ ప్రదేశ్ స్థలాల పేర్లను తాజాగా మార్చడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ‘మేము అలాంటి నివేదికలను చూశాము. చైనా ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదు. మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాము’ అన్నారు. ‘అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాంగా, విడదీయరాని భాగంగా ఉంది. ఎల్లప్పుడూ ఉంటుంది. కొత్త పేర్లను పెట్టడం ద్వారా వాస్తవికతను మార్చలేరు’ అని కూడా ఆయన తెలిపారు.

Arunachal Pradesh

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News