Monday, December 23, 2024

గోధుమల ఎగుమతులపై నిషేధాజ్ఞల సడలింపు

- Advertisement -
- Advertisement -

India Relaxation of bans on wheat exports

 

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధాజ్జల్లో కాస్త సడలింపునిచ్చింది. గోధుమల కన్‌సైన్‌మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్టయితే అటువంటి కన్‌సైన్‌మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈజిప్టునకు వెళ్లే గోధుమల కన్‌సైన్‌మెంట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కన్‌సైన్‌మెంట్ ఇప్పటికే కాండ్లా నౌకాశ్రయంలో లోడింగ్ అవుతోంది. ఈజిప్టు ప్రభుత్వంతోపాటు, ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్స్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజ్ఞప్తి మేరకు ఈ కన్‌సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టునకు ఎగుమతి చేయబోతున్నారు.

ఇతర దేశాల ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు ఆయా దేశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్టే , ఆ దేశాలకు గోధుమలను ఎగుమతి చేయవచ్చునని వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. అదే విధంగా రద్దు చేయడానికి వీలుకానటువంటి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఈ నోటిఫికేషన్ జారీ అయిన తేదీన లేదా అంతకు ముందు జారీ చేసినట్టయితే , అందుకు సంబంధించిన సాక్షాధారాలను సమర్పించి ఎగుమతి చేయవచ్చునని తెలిపింది. గోధుమల ఎగుమతిపై భారత దేశం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం వీటి ధరలు 6 శాతం పెరిగాయి. మనదేశంలో 4 నుంచి 8 శాతం వరకు తగ్గిపోయాయి. రాజస్థాన్‌లో క్వింటాలు గోధుమల ధర రూ.200 నుంచి రూ.250 వరకు తగ్గింది. పంజాబ్ లో రూ.100 నుంచి రూ. 150 వరకు తగ్గింది. ఉత్తరప్రదేశ్‌లో రూ. 100 వరకు తగ్గింది. అన్ని రకాల గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అత్యదిక ప్రొటీన్ ఉండే గోధుమలు , సాధారణ సాఫ్ట్ బ్రెడ్ రకాల గోదుమల ఎగుమతులను కూడా నిషేధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News