Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 2.38లక్షల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Report 2.38 lakh Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 2,38,018 కోవిడ్-19 కేసులు, 310 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో 1,57,421 రికవరీలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 4,86,761మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 17,36,628 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటీవిటీ రేటు 19శాతం నుంచి 14.43 శాతానికి తగ్గింది. భారత్ లో ఇప్పటివరకు 8,891 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. 3,109 ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు కోలుకున్నారు. ఇండియాలో ఇప్పటివరకు 158 కోట్లకు పైగా కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

India Report 2.38 lakh Corona Cases in 24 hrs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News