Friday, November 15, 2024

దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..

- Advertisement -
- Advertisement -

India report 2796 corona deaths in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి గత కొన్ని రోజులుగా కాస్త హెచ్చు తగ్గులతో నిలకడగా కొనసాగుతోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆదివారం ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంతగా భారీ సంఖ్యలో నమోదైంది. బీహార్, కేరళ రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరించడమే దీనికి కారణం. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 12, 26,064 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,895 కేసులు వెలుగు చూశాయి. ఇక శనివారం ఒక్క రోజే 2,796 మరణాలు నమోదయ్యాయి. బీహార్, కేరళ రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరించడంతో అది ఈ స్థాయికి చేరింది. బీహార్‌లో ఒక్క రోజే 2,426 మరణాలు నమోదైనట్లు పేర్కొనగా, కేరళలో 263 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,73,326కు చేరింది. ఇక శనివారం 6,918 మంది వైరస్‌నుంచి కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 34 కోట్లను దాటింది. రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 99,155 ఉన్నాయి. ఆ రేటు 0.29 శాతానికి తగ్గింది. గత కొన్ని రోజులుగా యాక్టివ్ కేసులు లక్ష దిగువనే ఉండడం గమనార్హం.

India report 2796 corona deaths in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News