- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అధికమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. ఇందులో 1,199మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121, హర్యానాలో 114, తెలంగాణలో 107 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇక, నిన్న ఒక్కరోజే దేశంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తున్నాయి.
India Report 3007 Omicron Cases
- Advertisement -