Tuesday, January 21, 2025

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికి పైగా రోజువారీ కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. బుధవారం 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 5,335 మందికి వైరస్ సోకిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముందురోజు ఆ సంఖ్య 4,435గా ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 25 వేల మార్కు దాటాయి.

మొత్తం కేసుల్లో బాధితుల వాటా 0.06 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. తాజాగా కేంద్రం ఆరుగురు మరణించినట్టు ప్రకటించింది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,929 కి చేరింది ఇప్పటివరకు 220.66 కోట్ల టీకా కేసులు పంపిణీ అయ్యాయి. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ .1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News