న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 7974 మందికి వైరస్ సోకినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కారోనాతో మరో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటికంటే 14 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని పేర్కొంది.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,47,18,602 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇక, కరోనాతో మొత్తం 4,76,478 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో కొత్తగా 7948 మంది బాధితులు కోవిడ్-19 నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3,41,54,879 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు 98.38 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 135.25 కోట్లకుపైగా కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.
India Report 7974 new corona cases in 24 hrs