Monday, January 20, 2025

భారత్‌లో క్లేడ్ 1 మంకీపాక్స్ తొలి కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రాణాంతక క్లేడ్ 1 బీ రకం మంకీపాక్స్ తొలికేసు నమోదైంది. ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారి తీసిన క్లేడ్ 1 బీ రకంగా దీన్ని గుర్తించారు. కేరళ లోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యూఏఈ నుంచి ఇటీవలనే ఆయన కేరళకు వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయగా క్లేడ్1 గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా గత నెల రెండోసారి ప్రకటించడానికి దారి తీసింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎంపాక్స్ మొదటి కేసు ఢిల్లీలో బయటపడింది.

హర్యానా లోని హిసార్‌కు చెందిన 26 ఏళ్ల యువకునిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతనిలో పశ్చిమాఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్2 రకం లక్షణాలు గుర్తించారు. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ లోని ఎల్‌ఎన్‌జేసీ ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత సెప్టెంబర్ 21న డిశ్చార్జి అయ్యాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను ప్రజా ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా 2022లో ప్రకటించింది. అప్పటి నుంచి భారత్‌లో 30 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి పట్ల తీసుకోవాలసిన మార్గదర్శకాలను కేరళ ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News