Wednesday, January 22, 2025

కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి

- Advertisement -
- Advertisement -

India reported 251209 fresh Covid-19 cases

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే పాజిటివిటీ రేటు 19.5 శాతం నుంచి 15.88 శాతానికి తగ్గింది. గురువారం 15 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఒకవైపు కేసులు తగ్గినా, మరణాలు మాత్రం పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 627 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 153 కేరళ నుంచి వచ్చినవే . ఈ రెండేళ్ల కాలంలో 4,92,327 మంది మహమ్మారికి బలయ్యారు. మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండగా, కేరళ, కర్ణాటక , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లో పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదవుతోంది. గురువారం ఒక్క కేరళ లోనే 51 వేల మందికి కరోనా సోకింది. 94 శాతం కొవిడ్ పాజిటివ్ నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వెల్లడించారు. మిగిలిన ఆరు శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉన్నట్టు చెప్పారు. కేరళలో మూడో వేవ్‌కు ఒమిక్రాన్ వేరియంట్ కారణమని ఈ గణాంకాలతో వెల్లడైందని తెలిపారు.

భారీగా రికవరీలు

గత కొద్ది రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గురువారం 3,47,443 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.60 శాతానికి మెరుగైంది. ఇప్పటివరకు 4.06 కోట్ల మందికి కరోనా సోకగా, 3.8 కోట్ల మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 21 లక్షలకు చేరాయి. ఆ కేసుల రేటు 5.18 శాతానికి తగ్గింది. గురువారం 57.3 లక్షల మంది టీకా తీసుకున్నారు. సంవత్సర కాలంలో కేంద్రం 164 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. అర్హులైన వారిలో 95 శాతం మందికి మొదటి డోసు అందగా, 74 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News