Monday, December 23, 2024

Corona: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,994 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు.

కరోనాతో ఇప్పటివరకు 5,30,876మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16వేలకు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,354 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, రికవరీ రేటు 98.77 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News