Monday, January 20, 2025

దేశంలో కొత్తగా 3.33 లక్షలకు పైగా కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reported 3.33 lakh fress coron cases

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 3,33,533 మందికి కరోనా వైరస్ సోకగా 525 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.92 కోట్లకు చేరుకోగా.. 4.89 లక్షలకు పైగా బాధితులు చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,59,168మంది కోలుకుకున్నారు. ప్రస్తుతం దేశంలో 21,87,205 కరోనా పాజిటీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 17.78 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 161.81కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.

India Reported 3.33 lakh fress coron cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News