న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, వరుసగా ఐదో రోజు కూడా దేశంలో మూడు లక్షల పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,75,533 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 3,06,064 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో మరో 439 మంది మృతి చెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.92 కోట్లకు చేరుకోగా, ఇప్పటివరకు 4,89,848మంది బాధితులు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 22,49,335 కరోనా పాజిటీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 20.79 శాతానికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో 162కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.
India Reported 3 lakh new corona cases in 24 hrs