న్యూఢిల్లీ: దేశంలో గత రెండు మూడు రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ రోజు లక్షకు పైగా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,52,717 పరీక్షలు నిర్వహించగా.. 1,79,339 కొత్త కేసులు వెలుగులోకి రావడం వైరస్ తీవ్రతను తెలియచేస్తోంది. కరోనా పాజిటివిటీ రేటు 13.29శాతానికి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 146 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.57కోట్లు దాటింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన బాధితులు సంఖ్య 4,83,846కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.44 కోట్లు దాటింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 152 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
India Reports 1.79 lakh corona cases in 24 hrs