Wednesday, January 22, 2025

భారత్‌లో 24 గంటల్లో 10093 కోవిడ్ కేసులు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా కరోనా వైరస్ సంక్రమణ 10093 చోటుచేసుకున్నాయి. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 57542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఆదివారం పేర్కొంది. కొత్తగా 23 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 531114కు చేరుకుంది. వాటిలో ఐదుగురు ఢిల్లీలో, ముగ్గురు ఛత్తీస్‌గఢ్‌లో, కర్నాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఇద్దరు, హర్యానా, ఒడిశా, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. కేరళలో నలుగురు కోలుకున్నారు. ఈ డేటా ఆదివారం ఉదయం 8.00 గంటలకు అప్‌డేట్ చేయబడింది. ఇక డైలీ పాజిటివిటీ రేటు 5.61 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 4.78 శాతంగా ఉంది. ఇక కోవిడ్ కేసుల 4.47 కోట్లు(44818115)గా నమోదయింది. ప్రస్తుతం క్రియాశీలక కేసులు 0.13 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.68 శాతంగా ఉందని, మరణాలు 1.19 శాతం అని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News