Saturday, January 18, 2025

దేశంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

దేశంలో గడిచిన 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్‌గా తేలిందని సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4.46కోట్లకు పైగా నమోదయ్యాయి.కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు దేశంలో 5,30,726 మంది మరణించారు.

ప్రస్తుతం దేశంలో 2,119 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.17 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News