న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 11,713 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 95 మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 14,488 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,08,14,304కి పెరిగింది. ఇండియాలో కరోనాతో 1,54,918 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో ప్రస్తుతం 1,48,590 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో ఇప్పటివరకు మొత్తం 1,05,10,796 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.17శాతం ఉండగా, మరణాల రేటు 1.43శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 54,16,849 కరోనా టీకాలు వేశారు. కాగా, ఫిబ్రవరి 5 వరకు మొత్తం 20,06,72,589 నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 7,40,794 మంది కరోనా పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. అటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 10.59 కోట్లకు చేరాయి. కోవిడ్ తో 23.07 లక్షల మంది చనిపోయారు.
India reports 11,713 new COVID-19 cases