- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 446 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42కోట్లకు పైగా చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,58,186మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో 14,667మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,36కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,59,272 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 106 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.
India reports 12830 new cases in 24 hours
- Advertisement -