- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 733 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42కోట్లకు పైగా చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,56,386మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో 17,095మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,36కోట్ల మంది బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,60,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 49,09,254 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని, ఇప్పటివరకు మొత్తం 104 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.
India reports 16156 new cases in 24 hours
- Advertisement -