- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 16,299 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అదే సమయంలో 19,431 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,25,076 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉందని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 207.29 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
- Advertisement -