Monday, December 23, 2024

దేశంలో పెరిగిన కరోనా మరణాలు..

- Advertisement -
- Advertisement -

India Reports 1660 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో కొత్తగా 4100మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,20,855 కి చేరింది. తాజా కరోనా నుంచి 2,499 మంది  కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య.. 4.24కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.  దేశంలో ప్రస్తుతం 16,741 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టీవ్ కేసులశాతం 0.05 శాతంగా ఉండగా.. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.24% శాతంగా ఉంది. ఇప్పటివరకు 1.82కోట్ల కరోనా డోసుల‌ను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

India Reports 1660 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News