Monday, January 20, 2025

దేశంలో కొత్తగా 2.47లక్షలకు పైగా కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 2.47 lakh fresh Covid cases in 24 hrs 

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19 విజృంభణ క్రమ క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా ఏకంగా 2 లక్షలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,47,417 కొత్త కేసులు నమోదైనట్లు గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. నిన్నటి కంటే అత్యధికంగా 27 శాతం కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 84,825 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 11,17,531కు చేరింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 13.11 శాతానికి చేరింది. ఇక, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5,488లకు చేరుకున్నాయి.

India reports 2.47 lakh fresh Covid cases in 24 hrs 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News