న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రెండు వేలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,075 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 71మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4.30కోట్లుకు చెరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 3,383 మంది కోలుకోగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.24కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, కరోనాతో దేశంలో మొత్తం 5,16,352మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 27,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 0.41 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 181 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
India reports 2075 new Covid-19 cases in 24 hrs