Wednesday, January 22, 2025

భారత్‌లో కొత్తగా 2119 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 2119 fresh cases and 2582 recoveries

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి.  గడిచిన 24 గంటల్లో దేశంలో 2119 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ లో ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,38,636 కు పెరిగింది. తాజాగా 2582 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అదే సమయంలో 10 మందికి వైరస్ బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,28,953 కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25,037 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా పాజిటివిటి రేటు 87.9 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News