- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,527 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1656 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 15,079కి చేరింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా 187.46 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
- Advertisement -