Monday, December 23, 2024

కొత్తగా 2541 కరోనా కేసులు.. 30మంది మృతి

- Advertisement -
- Advertisement -

India reports 2541 new cases 30 deaths

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మృతి చెందారు. 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కరోనాబారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,87,71,95,781 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News