- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,593 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 44 మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,30,57,545కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 5,22,193మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,873కి చేరింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా 187.46 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India Reports 2593 New Corona Cases
- Advertisement -