న్యూఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,61,500 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 1,38,423 మంది బాధితులు కోలుకోగా… 1,501 మంది మృతి చెందారు. ఇండియాలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 47 లక్షల 88,109కి చేరింది. దేశంలో కోవిడ్-19 మరణాలు 1,77,150కి పెరిగాయి. దేశవ్యాప్తంగా 18,01,316 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు భారత్ లో కోటీ 28లక్షల 9,643 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో 12,26,22,590 కోట్ల మందికి పైగా కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. కాగా, దేశంలో ఏప్రిల్ 17 వరకు 26,65,38,416 మంది నమూనాలను పరీక్షించారు. నిన్న 15,66,394 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -