- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా అల్లాకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,49,691 కొత్త కోవిడ్-19 కేసులు, 2,767 మరణాలు, అదే సమయంలో 2,17,113 కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,40,85,110 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,92,311 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ప్రస్తుతం 26,82,751 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం 14,09,16,417 మందికి టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో వరుసగా నాలుగో రోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ లో వరుసగా ఐదో రోజు 2వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి.
- Advertisement -