- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,805 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి 13మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి 5,069మంది కోలుకున్నారు. కాగా, తాజా కేసులతో దేశంలో మొత్తం కేసులు 4.45కోట్లకు చేరాయి. ఇందులో 4.40కోట్లకు పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 5,28,655మంది బాధితులు కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 38,293 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, దేశవ్యాప్తంగా 218.68కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
India Reports 3805 new coron cases in 24 hrs
- Advertisement -