- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 15మంది బాధితులు మృతిచెందినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.31కోట్లు దాటాయి. ఇక, దేశవ్యాప్తంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిని సంఖ్య 5,24,692కు చేరుకుంది. గత 24 గంటల్లో 2619 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 4.26కోట్లకు పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 24,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో పాజిటీవ్ కేసులు అధికంగా నమోదువున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.94కోట్లకు పైగా కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
India Reports 4270 new corona cases in 24 hrs
- Advertisement -