- Advertisement -
న్యూఢిల్లీ: భారత్‌లో సోమవారం 4282 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీలక(యాక్టివ్) కేసుల సంఖ్య 1750 తగ్గి 47246కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తాజా గణాంకాలు చెబుతున్నాయి. కాగా 14 తాజా మరణాలతో మరణాల సంఖ్య మొత్తం 531547కి పెరిగింది. తాజా మరణాలలో ఆరు మరణాలు కేరళ నుంచే. భారత్‌లో కరోనా వైరస్ కేసులు ఆదివారం 5874 నమోదు కాగా, 49015 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. సోమవారం దినసరి పాజిటివ్ రేటు 4.92 శాతంగా నమోదయింది. వారాంత పాజిటివిటీ రేటు 4.00 శాతంగా ఉంది.
- Advertisement -