Sunday, December 22, 2024

కొత్తగా 441 కొవిడ్ కేసులు.. నమోదు కాని మరణాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 441 కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. అయితే క్రియాశీలక కేసుల సంఖ్య 3238కి తగ్గిందని కేంద్రం తెలిపింది. మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ప్రకారం, గడచిన 24 గంటలలో కొత్తగా మరణాలు ఏవీ నమోదు కాలేదు. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య డిసెంబర్ 5 వరకు రెండు అంకెల శ్రేణిలో ఉండేవి.

కానీ శీతగాలులు, కొత్త కొవిడ్ 19 వేరియంట్ జెఎన్ 1 కారణంగా కేసులు మళ్లీ పెరగసాగాయి. డిసెంబర్ 5 తరువాత 31న అత్యధికంగా ఒక్క రోజులో 841 కేసులు న మోదు అయ్యాయి. కాగా, 3238 క్రియాశీల కేసులలో అత్యధిక రోగులు (సుమారు 92 శాతం) ఇంటిలోనే ఒంటరిగా ఉంటూ కోలుకుంటున్నారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో ఇంత వరకు 220.67 కోట్ల కొవిడ్ 19 వ్యాక్సిన్‌ల డోస్‌లు ఇవ్వడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News