- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,877 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో 804మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5కోట్లకు చేరుకుంది. ఇందులో 5.08లక్షల మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 1,17,591 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా.. ఇప్పటివరకు 4,15,85,711మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,37,045 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతానికి తగ్గిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 172.29కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
India reports 44k new Corona cases in 24 hrs
- Advertisement -