ఒక్కరోజే 1,183 మంది మృతి, తగ్గుతున్న పాజిటివ్ కేసులు, పెరుగుతున్న రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 2.97 శాతానికి తగ్గింది. శుక్రవారం ఒక్కరోజే దేశంలో 48,698 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,01,83,143కి పెరిగింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు మొత్తం 1,183మంది వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 3,94,493కి చేరుకుంది. దేశంలో యాకివ్ కేసుల సంఖ్య 5,95,565కి తగ్గింది. గత 44 రోజులుగా వరుసగా కొత్తగానమోదవుతున్న కేసులతో పోలిస్తే రికవరీల సంఖ్య తక్కువగా ఉంది. రికవరీ రేటు 96.72 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు వైరస్ నుంచి మొత్తం 2,91,93,085 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 61.19 లక్షల వ్యాక్సిన్ డోసులను అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 31.50 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆరోగ్య శాఖ పేర్కంది.
India reports 48,698 new Covid-19 cases