Sunday, January 5, 2025

భారత్ లో కొత్తగా 5,664 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 5664 fresh Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,89,228 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా, 5,664 మందికి కరోనా వైరస్‌ సోకింది. వైరస్ బారినపడి మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 4,555 మంది కొవిడ్ మహామ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 47,922 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ సానుకూలత రేటు 1.96 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటిరకు 14,84,216 మందికి కొవిడ్ టీకాలు వేశారు. పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 216.56 కోట్లకు చేరిందని కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News