Sunday, December 22, 2024

దేశంలో కొత్తగా 640 కరోనా కేసులు..ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 640కరోనా కేసులు నమోదవగా ఒకరు మృతిచెందారు. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు మొత్తం 2,997 యాక్టివ్ కేసులున్నాయి. కేరళలో ఒక్క రోజే 265 కొత్త కేసులు నమోదవగా ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2,606 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. కేరళ తర్వాత కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి,మహారాష్ట్రలలో ఎక్కువ కేసులున్నాయి. తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు, తమిళనాడులో 15,కర్నాటకలో13 కొత్త కేసులు నమోదయ్యాయి.

జెఎన్.1 వేరియంట్ కేసులు 22

ఇదిలా ఉండగా కొత్తగా వెలుగు చూసిన జెఎన్.1 సబ్ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటివరకు దేశంలో 22 కేసులు నమోదయ్యాయని, వీటిలో గోవాలో 21 కేసులు నమోదు కాగా, కేరళలో ఒక కేసు నమోదయిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గోవాలో వైరస్ సోకిన అందరు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కోలుకున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన అందరిలోనే స్వల్పంగా పొడిదగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఉండడం లేదా లేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. జెఎన్.1 వేరియంట్‌ను కనుగొనడానికి నవంబర్‌లో 62 శాంపిల్స్‌ను వేర్వేరు ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపించడం జరిగిందని,

డిసెంబర్‌లో ఇప్పటివరకు 253 శాంపిల్స్‌ను పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 21 వరకు మొత్తం 22 జెఎన్.1 వేరియంట్‌కు చెందిన కేసులు నిర్ధారణ అయినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేశంలో జెఎన్.1 వేరియంట్‌కు సంబంధించిన కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ సోకిన వారిలో 92 శాతం మంది ఇంటివద్దే చికిత్సకు మొగ్గు చూపుతున్నారని, దీన్నిబట్టి వారిలో స్వల్ప అనారోగ్య సమస్యలున్నట్లు అర్థమవుతోందని ఆ అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరగలేదని వారు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News