న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. శనివారం 7వేలకు పైగా నమోదు కాగా.. ఆదివారం 6వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,563 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 132మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,46,838కు చేరుకుంది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,77,554మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,077 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,41,87,017 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 82,267 కరోనా యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.24 శాతంగా, రికవరీ రేటు 98.39 శాతంగా, మరణాల శాతం 1.37 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 137.67కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని తెలిపింది.
India Reports 6563 new corona cases in 24 hrs