Wednesday, January 22, 2025

భారత్‌లో కొత్తగా 6,809 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 6,809 fresh Covid cases

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,809 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరింది. అదే సమయంలో 8,414 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ సానుకూలత రేటు 2.12 శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 213.20 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News