- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 7వేల దిగువకు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,990 కొత్త కరోనా కేసులు, 190 మరణాలు సంభవించాయి. అదే సమయంలో కోవిడ్ నుంచి 10,116 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,00,543 కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,23,25,02,767 మందికిపైగా కోవిడ్ టీకా డోసులు వేసినట్టు చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్ లో కొత్త కోవిడ్-19 వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
- Advertisement -