Friday, April 4, 2025

దేశంలో కొత్తగా 7,178 కరోనా కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో గతకొన్ని రోజులుగా భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,342 కోవిడ్ పరీక్షలు చేయగా.. 7,178 మందికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 44.9కోట్లు దాటింది. ఇక, కరోనాతో మరో 16మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 5,31,345 మంది మరణించారు.

Also Read: భారత్ తన మతపరమైన విధులు నిర్వహిస్తోంది: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

కరోనా నుంచి గత 24 గంటల్లో 9,011మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4,43,01,865కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65,683 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News