- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 756 కొవిడ్ కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 4049 కి పెరిగింది. కేరళ, మహారాష్ట్రల్లో ఇద్దరేసి , జమ్ముకశ్మీర్‌లో ఒకరు కొవిడ్‌తో మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4. 4 కోట్లు కాగా, రివకరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. డిసెంబర్ 5 తరువాత కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది. డిసెంబర్ 31న 841 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4049 క్రియాశీల కేసుల్లో 92 శాతం వరకు ఇంటివద్ద ఐసొలేషన్ వల్లనే రికవరయ్యారు. కొత్తగా నమోదైన కొవిడ్ కేసుల్లో జెఎన్.1 వేరియంట్ కేసులు పెరుగుదల ఏమీ కనిపించలేదు.
- Advertisement -