Tuesday, November 5, 2024

దేశంలో మరో 86,498 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

India reports 86498 new COVID-19 cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 86,498 కొత్త కోవిడ్-19 కేసులు, 2123 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,82,282 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వరుసగా 26వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నారు. భారత్ లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,89,96,473కి చేరింది. దేశవ్యాప్తంగా 2,73,41,462 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇండియాలో 13,03,702 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ బారినపడి 3,51,309 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 23,61,98,726 మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, దేశంలో మొత్తం 36,82,07,596 నమూనాలను పరీక్షించారు, జూన్ 7 వరకు నిన్న 18,73,485 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News