Wednesday, January 22, 2025

దేశంలో ఒక్కరోజే లక్షకు పైగా కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports over 1.17 lakh corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10 రెట్లు పెరిగి మహమ్మారి పంజా విసిరింది. డిసెంబర్ 28న దాదాపు 9 వేల కేసులు ఉండగా, బుధవారం 90 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి.. తాజాగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,17,100 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 302 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 36,265 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు 3.45కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,83,178మంది బాధితులు కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

India Reports over 1.17 lakh corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News