- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కరోనా మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,42,793 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,61,386 లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 1733మంది మృత్యువాతపడ్డారు. దేశం వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,16,30,885కు చేరుకోగా, 4,97,975మంది చనిపోయారు. 3,92,30,198 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 9.26శాతంగా ఉండగా, రివకవరీ రేటు 94.91శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 16,21,603కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు దేశంలో 167 కోట్లకు పైగా కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India Reports over 1.61 lakh fresh corona cases
- Advertisement -